వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఒక రోజు వేతనం కోత ?
అమరావతి: వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ బిగ్ షాకిచ్చింది. ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలంటూ ఇటీవల వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలో 10,665 సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. విధులకు హాజరు కాకుండా నిరసనలో పాల్గొన్నందుకు ఒక రోజు జీతంలో ప్రభుత్వం కోత పెట్టింది. సచివాలయ ఉద్యోగులందరికీ జీతభత్యాలు మినహాయించాలంటూ.. డీడీఓలను మండల స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి జీతభత్యాలు విడుదల చేస్తే డీడీఓలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. శాంతియుతంగా డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తే జీతభత్యాలు కోత విధించడం ఏంటంటూ సచివాలయ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉద్యోగంలో చేరి రెండేళ్లు పూర్తయినా ప్రొబేషన్ డిక్లేర్, పే స్కేల్ అమలు చేయలేదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్త పీఆర్‌సీ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే సచివాలయాల ఉద్యోగులకు మాత్రం జులై నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. గత రెండేళ్లుగా అంకితభావంతో పని చేస్తున్న తమకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు ఇదా.. అని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. ప్రొబేషన్ పూర్తయినందున వెంటనే డిక్లరేషన్ ప్రకటించి పే స్కేలు వర్తింపజేయాలని కోరుతున్నారు
Download Below
ఎంపీడివో రొద్దం వారి ఒక రోజు జీతం నిలిపివేత ఉత్తర్వులు
మున్సిపల్ కమిషనర్ కళ్యాణదుర్గం వారి షో కాజ్ ఉత్తర్వులు