GSWS Transfers Dash Board -Track Number of GSWS Transfer Applications Received
బదిలీల ప్రక్రియ షెడ్యూల్ (జిల్లా పరిధిలో) :
- జిల్లాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఖాళీల వివరాల నమోదు తేది: మే 28
- ఆన్లైన్ లో దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేదీ : జూన్ 3
- నా ఆన్లైన్లో అందిన దరఖాస్తుల పరిశీలనకు చివరి తేదీ: జూన్ 6
- వెబ్ ర్యాంకు లిస్టుతో పాటు బదిలీలో ఉద్యోగికి కేటాయించిన మండలం లేదా పట్టణం వివరాలు తెలిపే తేది : జూన్ 6
- తిరస్కరించిన దరఖాస్తులు, తిరస్కరణ కారణంతో కూడిన జాబితా వెల్లడి : జూన్ 6
- బదిలీ అయిన ఉద్యోగులకు కేటాయించిన మండలం లేదా పట్టణంలో వ్యక్తిగత కౌన్సెలింగ్ తేదీలు : జూన్ 8, 9, 10
- బదిలీలో కొత్తగా కేటాయించిన సచివాలయ వివ రాలతో బదిలీ సర్టిఫికెట్ల జారీ తేది : జూన్ 8, 9, 10
- బదిలీలకు సంబంధించి కలెక్టర్లకు అభ్యంతరాలు తెలిపేందుకు చివరి తేదీ: జూన్ 10
వేరే జిల్లాకు బదిలీ కురుకునే వారి కోసం :
- జిల్లాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధి కారులు ఖాళీల వివరాలు నమోదు తేది: మే 28
- ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేది : జూన్ 3
- వేరే జిల్లాకు బదిలీకి వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసే తేది : జూన్ 8 (ఆ ఉత్తర్వులోనే బదిలీ చేసే మండ లం లేదా పట్టణం వివరాలు నమోదు)
- బదిలీ అయ్యాక ఉద్యోగులకు వ్యక్తిగత కౌన్సెలింగ్ తేదీ : జూన్ 8, 9, 10
- కొత్తగా కేటాయించిన సచివాలయం వివరాలతో బదిలీ సర్టిఫికెట్లు జారీ తేదీ: జూన్ 8, 9, 10
- బదిలీలకు సంబంధించి కలెక్టర్లకు అభ్యంతరాలు తెలిపేందుకు చివర తేది : జూన్ 10
బదిలీలు ఎలా జరుగును ?
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రాసెస్ మొత్తం మూడు స్టెప్ లో ఉంటుంది.- మొదట ఉద్యోగి ఆన్లైన్లో రిక్వెస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటారు.
- అర్హతల మేరకు మండలం/ULB లొ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది.
- అప్పాయింటింగ్ అథారిటీ సచివాలయ ఉద్యోగులకు కౌన్సిలింగ్ చేసిన తరువాత ఏ గ్రామా లేదా వార్డు సచివాలయము పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది.
బదిలీ దరఖాస్తు కు ఎవరు అర్హులు ?
- ఎనర్జీ అసిస్టెంట్ మినహా మిగిలిన అందరూ కూడా బదిలీలకు అర్హులు.
- 2019 మరియు 2020 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాయిన్ అయ్యి ఉండాలి.
- తేదీ మే 25, 2023 నాటికి రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి అయి ఉండాలి.
- తేదీ మే 25, 2023 నాటికి సర్వీసు రెగ్యులర్ అయి ఉండాలి.
- క్రమశిక్షణ చర్యలు / ACB / విజిలైన్స్ కేసులు పెండింగ్ ఉన్నవారు ట్రాన్స్ఫర్ కు అనర్హులు.
బదిలీలలో ఎన్ని మండలాలు /ULB లు సెలెక్ట్ చేసుకోవచ్చు ?
ఉద్యోగి తన HRMS పోర్టల్ లొ తనకి నచ్చిన 5 ప్రాధాన్యత మండలాలు లేదా ULB ఎన్నుకోవాలి.
కావలసిన డాక్యుమెంట్లు ఏమిటి ?
బదిలీ దరఖాస్తు ఫారం
NO DUES CERTIFICATE (MPDO/MC వారి నుంచి)
వితంతువులకు - భర్త మరణ ధ్రువీకరణ పత్రం
మెడికల్ గ్రౌండ్ వారికి - జిల్లా లేదా రాష్ట్ర మెడికల్ బోర్డు సర్టిఫికెట్
Spouse గ్రౌండ్ - మ్యారేజ్ సర్టిఫికెట్ , Spouse ఆధార్, ఉద్యోగి ఐడి కార్డు
GSWS HRMS TRANSFERS DASHBOARD Click Here